వన్ చైనా పాలసీలో భాగంగా ఎప్పటికైనా తైవాన్‌ను తన సొంతం చేసుకోవాలని డ్రాగన్ చూస్తున్నది. ఆ దిశగానే పావులు కదుపుతూ, తైవాన్‌తో దోస్తీ కట్టిన దేశాలను నయానో భయనో ఒప్పించి ఆ దేశం నుంచి బయటకు పంపిస్తోంది. 2025 నాటికి తైవాన్‌ను తన దేశంలో కలిపేసుకోవాలన్నది చైనా లక్ష్యం. అయితే, దీనికి అమెరికా అడ్డుపడుతున్నది. తైవాన్‌పై డ్రాగన్ ఎలాంటి సైనికచర్యలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని, తైవాన్ తరపున పోరాటం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్యదేశాల సదస్సుకు చైనాను పిలవకుండా తైవాన్‌ను ఆహ్వానించింది.
Read: డ్రాగన్‌కు జై కొట్టి…10 లక్షల టీకాలు కొట్టేసింది…
దీంతో చైనా అగ్గిమీద గుగ్గిలం అయింది. అమెరికా ఆహ్వనం మేరకు తైవాన్ అమెరికా వెళ్లి అక్కడ సదస్సులో పాల్గొన్నది. తైవాన్ మంత్రి ఆండ్రీ టాంగ్ వీడియో సందేశం ఇస్తుండగా వెంటనే ఆ సందేశాన్ని అమెరికా నిలిపివేసింది. కారణం ఏమంటే మ్యాప్. తైవాన్ మంత్రి ఆండ్రీ టాంగ్ మాట్లాడుతూ మ్యాప్‌లో చైనా, తైవాన్‌లు రెండు వేరువేరు రంగుల్లో ఉన్నాయని తెలిపింది. చైనా అనుసరిస్తున్న విధానాలకు విరుద్దమని పేర్కొంది. వెంటనే వీడియో ప్రసారాన్ని నిలిపివేసిన అమెరికా, మ్యాప్ ను ప్రదర్శించవద్దని తెలిపింది. అనంతరం అమెరికా అధ్యక్షభవనం ఓ సందేశాన్ని ఇచ్చింది. సదస్సులో చేసిన ప్రసంగాలు వారి సొంత అభిప్రాయాలని చెప్పుకొచ్చింది.
