ఉత్తర ప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది. తాజాగా కరోనాతో యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ముజఫర్ జిల్లాలోని చార్తవాల్ నియోజక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది యోగి కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక యూపీలో మొత్తం ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు.
కరోనా కాటుకు మరో యూపీ మంత్రి మృతి…
