Site icon NTV Telugu

ఎల‌న్ మ‌స్క్ కు ఆ భ‌యం ఎక్కువ…అందుకే గొప్ప‌వాడ‌య్యాడ‌ట‌…

ప్ర‌పంచ కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ బిజినెస్ మెన్ అయితే ఆయ‌న అత్యంత కౄరుడు కావ‌డంతో ఆయనంటే మ‌స్క్‌కు న‌చ్చ‌దు.  అందుకే చిన్న‌తనం నుంచి క‌ష్ట‌ప‌డి త‌న సొంత‌కాళ్ల‌పై నిల‌బ‌డుతూ చ‌దువుకున్నాడు.  చ‌దువుకునే రోజుల నుంచే ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టాడు.  క‌ష్టం విలువ తెలుసు కాబ‌ట్టే ఈరోజు ఆయ‌న ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎద‌గగ‌లిగాడు.  అయితే, చిన్న‌త‌నం నుంచి మ‌స్క్ న‌లుగురిలో మాట్లాడాలంటే భ‌య‌ప‌డిపోతాడు.  చాలా భ‌య‌స్తుడు.  మ‌స్క్‌కు ఆటిజం స‌మ‌స్య ఉంది.  ఆ భ‌యం.  

Read: మ‌య‌న్మార్‌లో ఆగ‌ని మార‌ణ‌హోమం… 30 మంది కాల్చివేత‌…

ఈ విష‌యాన్ని మ‌స్క్ అనేక సందర్బాల్లో చెప్పాడు.  ఆ భ‌యంతోనే త‌న మెద‌డు అంద‌రికంటే భిన్నంగా ప‌నిచేస్తుంద‌ని, సోష‌ల్ మీడియాలో వింత పోస్టులు పెట్ట‌డానికి కూడా అదే కార‌ణ‌మ‌ని, త‌న మెద‌డు అలానే ప‌నిచేస్తుందని చెప్పారు.  త‌న‌ను ప్ర‌త్యేకంగా గుర్తించాల‌నే ల‌క్ష్యంతోనే ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కొత్త‌గా క‌నిపెట్టాల‌ని అనుకుంటున్నాన‌ని, మార్స్ మీద‌కు మ‌నిషిని పంపించాల‌ని ప‌దేప‌దే చెప్పాల‌ని అనుకుంటాన‌ని, తాను సాధ‌రాణ వ్య‌క్తిని కాద‌ని మ‌స్క్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు.  బుల్లెట్ ప్రూఫ్ ఎల‌క్ట్రిక్ కారు త‌యారు అనేకసార్లు ఫెయిల్ అయింది, స్పేస్ ఎక్స్ రాకెట్లు విఫ‌లం అయ్యాయి.  ఆ స‌మయంలో మ‌స్క్ సంస్థ‌లు దివాళా తీసే స్థాయికి ఎదిగాయి.  కానీ, మ‌స్క్ వాటన్నింటిని ఎదుర్కొని లాభాల బాట ప‌ట్టించాడు.  ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.  

Exit mobile version