దేశంలో డిజిటల్ విప్లవం ఎంతవరకు సాధ్యమైంది ఈ వీడియో ను చూసి మనం తెలుసోవచ్చు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ప్రధాని మోడీ డిజిటల్ విప్లవానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏ చిన్న కిరాణా కొట్టు, పాన్, టీ స్టాల్ ఇలా చిన్న చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు ఇంటిముందుకు గంగిరెద్దులను తీసుకువచ్చి ఆటలాడిస్తుంటారు. అలా వచ్చిన వారికి బియ్యంతో పాటు కొంత నగదు కూడా ఇస్తుంటారు.
ఇప్పుడు ఇండియా మొత్తం డిజిటల్ చెల్లింపులపైనే లావాదేవీలు చేస్తున్న నేపథ్యంలో.. ఓ గంగిరెద్దును తీసుకొని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చాడు. అంతేకాకుండా ఆ ఎద్దుకు తలపై ఫోన్ పే క్యూఆర్ కోడ్ కూడా పెట్టి నగదు లేకుంటే.. ఇక్కడ స్కాన్ చేసి డబ్బులు ఇవ్వాలంటూ… చెట్టులెక్కగలవా అంటూ తనతో తెచ్చుకున్న సన్నాయిలో పాటందుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం విశేషం.
