ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 1,22,186 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తరువాతనే కరోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Read: ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్…
డిసెంబర్ 16 నాటికి లండన్‌లో ప్రతి 20 మందిలో ఒకరు కరోనా బారిన పడగా, నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య డబుల్ అయిందని, ప్రతి 10 మందిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే, తీవ్రత ఎలా ఉంటుంది, ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య రాబోయే రోజుల్లో పెరుగుతుందా లేదా తగ్గుతుందా అన్నది ఇప్పట్లో చెప్పలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ మొత్తం మీద చూసుకుంటే ప్రతి 35 మందిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారని, ఈ ఆదివారం నాటికి 25 మందిలో ఒకరు కరోనా బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
