Site icon NTV Telugu

మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు…

దేశంలో ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో మ‌రో కొత్త ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది.  మ‌హారాష్ట్ర‌లో కొత్త రెండు కేసులు క‌లిపి మొత్తం 20 కేసులు న‌మోద‌య్యాయి.  పూణే, లాతూర్‌లో రెండు కేసులు న‌మోదైన‌ట్టు మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  

Read: ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ మ‌రో హెచ్చ‌రిక‌: క‌ష్టాల ఊబిలోకి 50 కోట్ల‌మంది…

మ‌హారాష్ట్ర‌లో మొత్తం 20 కేసులు న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొదులుపెట్టింది.  ప‌లు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుండ‌టంతో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, క్రౌడ్‌ను త‌గ్గించాల‌ని కేంద్రం రాష్ట్రాల‌ను కోరింది.  అంతేకాదు, అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని స్ప‌ష్టం చేసింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

Exit mobile version