దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 కేసులు నమోదవ్వగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కొత్తగా రెండు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 10 కి చేరింది. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
Read: ఇది రైల్వే స్టేషన్ కాదు… ఎయిర్‌పోర్టే…
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ డేంజరస్ కావడంతో కరోనా నిబంధనలను తప్పనిసరి చేశారు. ఇటీవలే నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన మధ్యప్రదేశ్ సైతం తిరిగి నిబంధనలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తెలంగాణలో మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే వెయ్యిరూపాయల జరిమానా విధిస్తున్నారు.
