Site icon NTV Telugu

ఇండియాలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరిగి పోతుంది. తాజాగా ఇండియాలో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదయ్యాయి. గుజ‌రాత్ లో కొత్త గా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల యూకే నుంచి వ‌చ్చిన ఇద్ద‌రి లో ఒమిక్రాన్ వైర‌స్ ను గుర్తించారు.

https://ntvtelugu.com/bangarraju-vaasivaadi-tassadiyyaa-song-out-now/

త‌క్కువ వ్య‌వ‌ధిలోనే.. ఒమిక్రాన్ కేసులు వేగం పెర‌గ‌డం.. అంద‌రిన క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. గ‌త మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఇండియాలో డబుల్ అయింది. ప్ర‌స్తుతం 11 రాష్ట్రల్లో ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇండియాలో ప్ర‌స్తుతం 145 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక తెలంగాణ స్టేట్ లో 20 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. ఏపీలో 02 న‌మోదుయ్యాయి.

Exit mobile version