Site icon NTV Telugu

గుడ్‌న్యూస్‌.. త్వరలో భారత్‌ నుంచి మరో రెండు వ్యాక్సిన్లు..

కంటికి కనిపించకుండా ఎటాక్‌ చేసి ఎంతో మంది ప్రాణాలు తీసింది కరోనా మహమ్మారి.. మరెంతో మంది దాని బారినపడి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారు.. ఆ మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. దీని కోసం దేశీయంగా తయారైన వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి..

Read Also: సైబర్‌ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్‌.. రూ.3.40 లక్షలు టోకరా..

త్వరలోనే మరో రెండు స్వదేశీ ‘కోవిడ్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వస్తాయని పార్లమెంట్‌లో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. లోక్ సభలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడుతూ.. వ్యాక్సిన్ల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రెండు స్వదేశీ టీకాలను భారతీయ కంపెనీలు ఇక్కడే తయారు చేస్తున్నాయని తెలిపారు.. ఈ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలు తమ పరిశోధనల మూడో దశ ట్రయల్ డేటాను సమర్పించాయని.. ఈ రెండు వ్యాక్సిన్ల పరిశోధన విజయవంతంగా పూర్తి కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Exit mobile version