Site icon NTV Telugu

ఆ లిస్టులో మొన్న‌టి వ‌ర‌కు పాక్‌… ఇప్పుడు ట‌ర్కీకూడా…

ఇప్ప‌టి వ‌ర‌కు ఎఫ్ఏటీఎఫ్ అనుమానిత దేశాల లిస్టులో పాక్ ఉన్న‌ది.  ఎలాగైనా ఈ గ్రే లిస్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని పాక్ చూస్తున్న‌ది.  ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టాల ప్ర‌కారం 20 మార్గ‌ద‌ర్శకాలు ఉంటాయి.  అంత‌ర్జాతీయ నిధుల‌ను కొన్ని దేశాలు ఉద్ర‌వాద చ‌ర్య‌ల కోసం వినియోగిస్తుంటారు.  అలాంటి దేశాల‌తో ఎప్ప‌టికైనా ముప్పు ఉంటుంది.  2018 నుంచి పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ లిస్టులో ఉంచింది.  గ్రే లిస్టులో ఉంచ‌డం వ‌ల‌న నిధుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది.  రావాల్సిన నిధుల్లో కోత ప‌డ‌టం వ‌ల‌న ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ లిస్టులో పాక్ ఉండ‌గా, ఇప్పుడు ట‌ర్కీని కూడా చేర్చారు.  గ‌త కొంత కాలంగా ట‌ర్కీ చుట్టుప‌క్క‌ల దేశాల‌తో గొడ‌వ‌కు దిగుతున్న‌ది.  ఈ గొడ‌వ‌లను కార‌ణంగా చూపుతూ ట‌ర్కీని గ్రే లిస్టులో పెట్టింది.  గ్రే లిస్టులో చేర్చ‌డం వ‌ల‌న ఆ దేశ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోయే అవ‌కాశం ఉన్న‌ది. 

Read: అధ్య‌క్షులు మారినా… మార‌ని మాట‌…

Exit mobile version