డిసెంబర్ నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం 9 గంటలకు టికెట్లను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గత మాసంలో 2.40 లక్షల టికెట్లను 19 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందగా, ఇప్పుడు కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లు పొందడం విశేషం. డిసెంబర్ నెలకు సంబంధించి 3.10 లక్షల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కరోనా తరువాత టీటీడీ భక్తులకు ఆన్‌లైన్ ద్వారానే టికెట్లను అందిస్తోంది.
Read: ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం…దీనిపైనే చర్చ…