NTV Telugu Site icon

తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి… ఆ నాలుగు రోజులు సిఫారసులు బంద్

తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. జనవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు సిఫారసులపై గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ప్రకటించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి వేడుకలు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా తేదీలలో తిరుమల వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Read Also: అమెజాన్ కీలక నిర్ణయం.. ఇకపై అలెక్సా ర్యాంకులు బంద్

మరోవైపు జనవరి 11 నుంచి 14 వరకు తిరుమల వచ్చే ప్రముఖులకు వెంకట కళానిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటు చేసి గదులు కేటాయిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీఐపీలకు గరిష్టంగా రెండు గదులు మాత్రమే కేటాయిస్తామని వారు స్పష్టం చేశారు. ఆయా రోజుల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే బుక్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది.