ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం ఐదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై ఆర్టీసీ మోపుతోంది. ఆర్టీసీ టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచింది. టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడంతో టికెట్ ధరలు పెరిగాయి. శనివారం నుంచి పెరిగిన టికెట్ ధరలు అమల్లోకి వచ్చింది.
Also Read:Toll Plaza Prices: మొదలైన టోల్ బాదుడు.. వాహనదారుల జేబుకు చిల్లు
ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు రూ.4 టోల్ ఛార్జీలను పెంచారు. ఫలితంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్ ప్లాజా మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తాజా పెంపుతో ప్రయాణికులపై భారం పడింది.
Also Read:Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే