Site icon NTV Telugu

ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఆ టికెట్‌పై 20 శాతం తగ్గింపు..!

తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రుగుతున్న జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను సాధ్య‌మైనంత ఎక్కువ మంది సంద‌ర్శించేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఆర్టీసీ. విజ్ఞానాన్ని పెంపొందించాల‌నే ల‌క్ష్యం తో రూ.100 టికెట్ పై 20 శాతం రాయితీ ప్ర‌క‌టిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీఎస్ స‌జ్జనార్ ప్ర‌క‌ట‌న చేశారు.

https://ntvtelugu.com/kg-mutton-only-rs-50-in-andhra-pradesh/

న‌గ‌రంలో 24 గంట‌ల టికెట్ పై ఈ నెల 27 వ తేదీ వ‌ర‌కు త‌గ్గింపు పొంద‌వ‌చ్చ‌ని.. ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న లో పేర్కొంది. న‌గ‌రంలో 24 గంట‌ల పాటు చెల్లుబాటు అయ్యే రూ.100 టీ 24 టిక్కెట్ కొనుగోలు చేసిన వారికే ఇది వ‌ర్తిస్తుందంటూ ఆర్టీసీ వెల్ల‌డించింది. ఆర్టీసీ ప్ర‌క‌టించిన‌.. ఈ ఆఫ‌ర్ ను ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాలని.. స్వ‌యంగా సీపీ స‌జ్జనార్ కోరారు.

Exit mobile version