NTV Telugu Site icon

ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం: మాస్క్ లేకుంటే…

తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ దృష్ట్యా నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది.  తెలంగాణ ఆర్టీసీలో ప్ర‌యాణం చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌నే నిబంధ‌న‌లు విధించింది.  డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌తో పాటు ప్రయాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి. బ‌స్సులో శానిటైజ‌ర్ అందుబాటులో ఉంచాల‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.  క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి బ‌స్టాండ్‌లో మైకుల ద్వారా ప్ర‌క‌టిస్తుండాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు.  డిపోల‌కు వ‌చ్చిన బ‌స్సుల‌ను శుభ్రం చేస్తుండాల‌ని ఆదేశించారు.  బ‌స్సుల్లో మాత్ర‌మే కాకుండా బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లోనూ ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని, బ‌స్టాండ్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తుండాల‌ని స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.  

Read: రోశ‌య్య‌కు నివాళులు ఆర్పించిన కిష‌న్ రెడ్డి, చిరంజీవి…