NTV Telugu Site icon

5,323 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్… కానీ

ts govt

ts govt

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పాఠశాల విద్యాశాఖలో 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్‌ స్ట్రక్టర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయలు, కేజీబీవీలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిరెన్షియల్‌ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్‌ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేసింది.