అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వీప దేశాలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వెనిజులా తర్వాత గ్రీన్‌లాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా క్యూబా, మెక్సికోపై గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. క్యూబాకు ఎవరు చమురు విక్రయించొద్దని ప్రపంచ దేశాలను ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే.. టారిఫ్‌లు విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. క్యూబాకు చాలా ఏళ్ల నుంచి మెక్సికో ముడి చమురు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో మెక్సికోపై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: పైలట్ సుమిత్ కపూర్ స్నేహితులు సంచలన వ్యాఖ్యలు
క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యూబా ప్రభుత్వం.. అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని వెల్లడించారు. తాజా ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: మహిళా పైలట్లపై అజిత్ పవార్ చేసిన పాత పోస్ట్ వైరల్
ఇదిలా ఉంటే క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పేర్కొన్నారు. ఇది కేవలం సార్వభౌమ నిర్ణయం అని.. అంతే తప్ప అమెరికా ఒత్తిడితో కాదని తేల్చి చెప్పారు. కార్యాచరణ, మార్కెట్ కారకాల కారణంగా మెక్సికో చమురు సరఫరా హెచ్చు తగ్గులకు లోనవుతుందని తెలిపారు.
మరోవైపు అమెరికా- కెనడాల మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాపై ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికాలోకి దిగుమతయ్యే కెనడాకు చెందిన విమానాలపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికాకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్‌లకు సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే.. టారిఫ్‌లు విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
