అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌ను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు బహిష్కరించాయి. గత 9 నెలల కాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కాగా, ట్రూత్ సోషల్ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని, అలాంటి ప్రపంచంలోనే మనమూ ఉన్నామని, ట్విటర్‌లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే ట్రూత్ సోషల్ పేరుతో సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ మీడియా లయద టెక్నాలజీ కోసం 875 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. భవిష్యత్తులో వ్యాపారాన్ని అనుసరించి ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రూత్ సోషల్ పేరుతో ట్రంప్ సొంత మీడియా…
