NTV Telugu Site icon

ఎమ్మెల్యే రాజయ్య ‘బుల్లెట్‌ బండి’ స్టెప్పులు

తెలంగాణ జానపదానికి ఉన్న ఫాలోయింగే వేరు.. ఎప్పటికప్పుడు ఒక్కోపాట తెగ ట్రెండ్‌ అవుతుంది.. ఎక్కడికి వెళ్లినా అదే పాట ఇనిపిస్తుంటింది.. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలోనూ ట్రెండింగ్‌లో ఉన్న పాట బుల్లెట్‌ బండి… ఆ మధ్య ఓ వధువు.. పెళ్లి బరాత్‌లో ఈ పాటకు స్టెప్పులు వేయడంతో తెగ వైరల్‌ అయిపోయింది.. ఇక, ఆ తర్వాత ప్రతీ పెళ్లిలో బుల్లెట్‌ బండి పాట ఉండాల్సిందే అనే తరహాలో.. చాలా పెళ్లిళ్లలో ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు సైతం ఈ పాటకు స్టెప్పులు వేయగా.. తాజాగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా తాను సైతం అన్నారు.. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. ఆ కార్యక్రమానికి హాజరైన రాజయ్య.. విగ్రహావిష్కరణ తర్వాత చిన్నారులు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌లు వేస్తుంటే.. స్టేజ్ పైకి వెళ్లి చిన్నారులతో కలసి స్టెప్పులు వేశారు.. కాలు కదుపుతూ.. చేతులు తిప్పుతూ.. తానే తిరుగుతూ.. మొత్తంగా చిన్నారులతో కలిసి హుషారుగా డ్యాన్స్‌లు వేశారు తాటికొండ రాజయ్య.. అక్కడున్నవాళ్లు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి వైరల్‌ చేశారు.