Site icon NTV Telugu

వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్‌…

మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ మ‌ల్లాది వాసు చేసిన వ్యాఖ్య‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ స్పందిచారు.  వాసు వ్యాఖ్య‌ల‌ను ఖండీస్తూనే చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు.  బాబుతో పాటుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా వ‌ల్ల‌భ‌నేని వంశీ విరుచుకుప‌డ్డారు.  అరికెపూడి గాంధీ క‌మ్మ‌సంఘం నేత‌నా లేక ఎమ్యెల్యేనా అని ప్ర‌శ్నించారు.  వంశీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Read: మ‌ధిర కౌన్సిల‌ర్ మ‌ల్లాది వాసు వ్యాఖ్య‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ కౌంట‌ర్‌…

వంశీ నోరు అదుపులో పెట్టుకోవాల‌ని, త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే అని, మ‌ల్లాది వాసు మాట్లాడిన మీటింగ్‌లో తాను లేన‌ని అన్నారు.  మీటింగ్‌లు పెట్టుకుంటే త‌ప్పేంట‌ని గాంధీ ప్ర‌శ్నించారు.  ఏపీ అసెంబ్లీలో ఓ మ‌హిళ ప‌ట్ల కామెంట్ల‌ను స‌మాజం ఖండించింద‌ని, తాను కూడా ఖండించాన‌ని అరికెపూడి గాంధీ పేర్కొన్నారు.  మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ చేసిన వ్యాఖ్య‌లు రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.  రెండు రాష్ట్రాల నేత‌లు కౌంట‌ర్లు, ప్ర‌తికౌంట‌ర్లు వేసుకుంటున్నారు.  

Exit mobile version