NTV Telugu Site icon

నేడు మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టులో విచారణ..

దొంగతనం కేసులో పోలీసులు మరియమ్మ అనే మహిళను తీసుకెళ్లారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసి చంపేసినట్లు ఆరోపనలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరియమ్మ లాకప్‌డెత్ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. మరియమ్మ మృతిపై గతంలోనే హైకోర్టుకు మెజిస్ట్రేట్‌ నివేదిక సమర్పించారు. అయితే కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో కేసు పూర్తి వివరాలను ఏజీ సొలిసిటర్‌ జనరల్‌కు అప్పగించారు. అయితే సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది. దీంతో ఈ రోజు సీబీఐ ఎస్పీ హైకోర్టులో హజరుకానున్నారు. గత విచారణలో మరియమ్మ కేసును సీబీఐకి అప్పగిస్తామని హైకోర్టు వెల్లడించడంతో నేడు జరుగనున్న హైకోర్టు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.