Site icon NTV Telugu

వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఏపీలోని మాడుగులలో 8.1 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పాడేరు, అరుకులలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని కొమురంభీం జిల్లాలోని సిర్పూర్‌(యు)లో 11.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గిన్నెదరిలో 12.1, తిరగయాణిలో 13 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 13.3, పిప్పల్‌ దరిలో 13.5, పెంబిలో 13.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఆవరించడంతో వాహనదారుల రాకపోకల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Exit mobile version