NTV Telugu Site icon

Village Road Bridge: వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి.. మర్రిచెట్టే వారికి వంతెన

Raod Bridge

Raod Bridge

ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి. ఇది ఓ గ్రామంలోని ప్రజలు పడుతున్న అవస్థ. ఒడిషాలోని గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లోని ఏడు గిరిజన గ్రామాలకు సరైన దారి లేదు. ఈ గ్రామాల ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే వాగును దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా ప్రవహించే నది గుండా వెళ్లాలి. ఏడాదిలో దాదాపు ఆరు నెలలు వారిది ఇదే పరిస్థితి. బయటి ప్రపంచం చూడాలంటే పంట పొలాలు, కొండలు మధ్య ఉన్న ప్రమాదకర వాగు దాటాలి. దాని కోసం ఒక చెట్టు ఎక్కాలి.

బయటకు వెళ్లడానికి వారికి ఉన్న ఏకైక మార్గం ఈ చెట్టు ఒక్కటే. బడికెళ్లే చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఈ దారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ వాగు పక్కన మర్రిచెట్టు కుంది. దీంతో గ్రామస్తులు ఆ చెట్టునే నమ్ముకున్నారు. మర్రిచెట్టను వంతెనగా రాకపోకలు చేస్తు్న్నారు. ప్రమాదం అని తెలిసినా మరో దారి లేక ఇలా చెట్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Stomach Bloating: కడుపు ఉబ్బరంగా ఉందా ?.. నివారణ మార్గాలు ఇవీ

Show comments