అనగనగా ఓ దీవి ఆ దీవిలో అనంత సంపద. ఆ సంపదను చేజిక్కించుకోవడానికి వేలాది మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఆ దీవిలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. వెళ్లినా అక్కడ సంపద దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే ఆ నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి. ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ నదిలో ఉన్నది. ఇది రహస్యదీవి. అక్కడి వెళ్లడం సామాన్యులకు సాధ్యం కాదు. నదిలో వేల సంఖ్యలో మొసళ్లు తిరుగుతుంటాయి. ఏమరుపాటుగా ఉంటే వాటికి ఆహారంగా మారిపోవాల్సిందే. ఇలా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
Read: అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం: 2022 ఎన్నికల్లో…
చాలా మంది ఆ గోల్డెన్ దీవి కోసం, అందులోని అంతులేని సంపద కోసం ప్రయత్నించి వెనుదిరిగారు. మత్స్యకారులు సైతం ఆ దీవి కోసం అన్వేషించారు. కాని దొరకలేదు. పట్టువదలకుండా ఐదేళ్ల నుంచి ప్రాణాలకు తెగించి దీవి కోసం అన్వేషణ సాగించగా ఎట్టకేలకు నిథి ఉన్నదీవి బయటపడింది. ఆ దీవిని చూసిన మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. అందులో అంతులేని సంపద ఉన్నది. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, బుద్ధవిగ్రహం వంటివి అనేకం ఉన్నాయి. మత్స్యకారులకు దొరికిన బుద్ధుని విగ్రహం ఆధారంగా ఆ సంపద శ్రీ విజయ కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. ఒక్క బుద్దవిగ్రహం ఖరీదు మిలియన్ డాలర్లు ఉంటుందని చెబుతున్నారు.