NTV Telugu Site icon

రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్ట్‌గా సీహెచ్‌కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌, సెషన్స్‌ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిగా బి.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్‌, ఆదిలాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జిగా రామకృష్ణ సునీత, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్‌ అప్పేలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్‌ పర్సన్‌గా జి.అనుపమ చక్రవర్తి లను జడ్జీలుగా బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది.