రైలు ఎక్కడపడితే అక్కడ ఆగదు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు లేదంటే స్టేషన్ వచ్చిపుడు మాత్రమే ట్రైన్ ఆగుతుంది. రైలు ఆలస్యమైతే దానిపై సవాలక్షా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్‌లో ఓ ట్రైన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాకిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలు కహ్నా కచ్ అనే ప్రాంతంలో సడెన్ గా ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. ఐదు నిమిషాల తరువాత రైలు తిరిగి మూవ్ అయింది. అయితే, కహ్నా కచ్‌లో ఐదు నిమిషాలపాటు ట్రైన్ ఆగడానికి కారణం లేకపోలేదు. ట్రైన్ డ్రైవర్ రాణా మహమ్మద్ దిగి పెరుగు కొనుక్కునేందుకు వెళ్లాడట.
Read: తుపాకుల వందనం అంటే ఏంటి? ఎందుకు పాటిస్తారు?
అక్కడ పెరుగు బాగుంటుందని తన తల్లికి పెరుగు కొనేందుకు దిగి వెళ్లినట్టు ఎంక్వైరీలో చెప్పాడు. కహ్నాకచ్ ప్రాంతంలో ట్రైన్ ఆగి, డ్రైవర్ పెరుగు ప్యాకెట్ వెళ్తున్న దృశ్యాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం రైల్వేశాఖమంత్రి వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఇద్దరు డ్రైవర్లను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా డ్యూటీలో ఉన్న డ్రైవర్లు సెల్ఫీలు దిగడం, ఫోన్ మాట్లాడుకోవడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.