Site icon NTV Telugu

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్.. రైలులో 2,348 మంది ప్యాసింజర్లు

కర్ణాటకలో శుక్రవారం తెల్లవారుజామున కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ధర్మపురం జిల్లా తొప్పూర్-శివడి స్టేషన్‌ల మధ్య కొండచరియలు విరిగిపడి ట్రాక్‌పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 5 బోగీలు ట్రాక్ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: దేశంలోనే తొలి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ

కన్నూరు రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన రైలు శుక్రవారం ఉదయం 7:40 గంటలకు బెంగళూరు చేరాల్సి ఉంది. అయితే ధర్మపురి జిల్లా తొప్పూర్ వరకు సాఫీగా నడిచిన రైలు.. కాసేపటికే పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రానికి రూట్ క్లియర్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version