NTV Telugu Site icon

Hyderabad: లాలాగూడలో విషాదం.. తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

Hyd Susicide

Hyd Susicide

అమ్మను మించిన దైవం ఈ లోకాన లేదు. అమ్మ అంటేనే ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, ఆనందం, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కడుపులో నవ మాసాలు మోసి అమ్మ బిడ్డకు జన్మినిస్తుంది. ఆ తర్వాత.. బిడ్డను గారభంగా పెంచడం దగ్గర నుంచి మొదలు పెడితే, పెరిగి పెద్దయ్యేదాకా ఆలన.. పాలనా చూసుకుంటుంది. కడుపుకు ఆకలి వేయకున్న ముద్ద కలిపి నోట్లో పెడుతుంది. డబ్బులు కావాలంటే అడగగానే గొప్ప గుణం అమ్మకే ఉంటుంది. ఇలా అమ్మ గురించి చెప్పుకుంటే పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అమ్మ గురించి ఎందరో కవులు కవితలు రాశారు. ఎందరో పాఠలు పాడారు. అమ్మ గొప్ప తనం గురించి సినిమాలు కూడా తీశారు. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం.

Read Also: Arvind Kejriwal: ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు.. కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల ఆందోళన..

అసలు విషయానికొస్తే.. హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు. అయితే.. రెండు రోజులుగా తల్లి, కుమారుడి మృతదేహాలు గదిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో.. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి, కుమారుడు లాలాగూడలో 8 సంవత్సరాల నుండి రెంట్‌కు నివాసం ఉంటున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Dil Raju: కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యా!

Show comments