Site icon NTV Telugu

బర్త్‌డే కోసం రావొద్దు… అభిమానులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యువ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈనెల 8న (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని.. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Read Also: అరుపులు పుట్టిస్తున్న ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్

మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, పూలదండలకు పెట్టే ఖర్చును అనాథలకు, పేదవారికి సహాయం చేయాలని అభిమాలనుకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అభిమానులు తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పే శుభాకాంక్షలకన్నా ఈ పని తనకు ఎంతో సంతృప్తి ఇస్తుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version