NTV Telugu Site icon

Bomb Threat: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

Delhi Public School

Delhi Public School

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు తర్వాత పాఠశాల ఖాళీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఏమీ దొరకలేదు. ఘటనా స్థలంలో పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8.10 గంటల ప్రాంతంలో పాఠశాల అధికారుల నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. వెంటనే పాఠశాలను ఖాళీ చేయించారు.
Also Read: Tragedy: రెహమత్ నగర్‌ లో విషాదం.. గోడ కూలి నెలల పసికందు మృతి

కాగా, ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీలోని సాదిక్ నగర్‌లోని ‘ది ఇండియన్ స్కూల్’ ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొంటూ ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. బాంబు స్క్వాడ్, ఇతర ఏజెన్సీలు పేలుడు పదార్ధం కోసం ఆవరణలో తనిఖీ చేయడంతో పాఠశాలను ఖాళీ చేయించారు. ఆ మెయిల్ బూటకమని తర్వాత ప్రకటించారు.

Show comments