మనదగ్గర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా 40 వరకు పలుకుతున్నది. టమోటాతో పాటుగా మిగతా కూరగాయల ధరలు కూడా అలానే ఉన్నాయి. అయితే, మనదగ్గర టమోటా రూ.40 వరకు ఉంటే అమెరికాలు రెండు పౌండ్ల టమోటా (కిలో) ఏకంగా రూ.222 ఉన్నది. ఒక్క టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కిలో క్యారెట్ రూ.163, కిలో వంకాయలు రూ.444, పాలకూర 5 కట్టలు 474, కొత్తిమీర కట్ట 103, కిలో ఆలు రూ.425, క్యాబేజీ 296 ఉన్నది. ఈ ధరలను చూస్తే నిజంగా కళ్లు తిరగడం ఖాయమని చెప్పాలి.
అక్కడ కిలో టమోటా రూ.222… కొత్తిమీర వందకు పైనే…
