Site icon NTV Telugu

టుడే కోవిడ్ అప్ డేట్

1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్‌లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య.

  1. ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్నారు మరో 669 మంది బాధితులు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 కరోనా యాక్టివ్‌ కేసులు వున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖ జిల్లాలో 1,028 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 253, తూ.గో. జిల్లాలో 233 కరోనా కేసులు వచ్చాయి.
  2. కరోనా కేసుల నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
  3. దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. పండుగ సమయం కావడంతో.. టీకాలు ఇవ్వడం కాస్త నెమ్మదించింది. నిన్న 57.37 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. 3.92 లక్షల మంది ప్రికాషన్‌ డోసు పొందారు. ఇప్పటివరకు మొత్తం 156.02 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.
  4. పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముండడంతో తెలంగాణలో సంక్రాంతి సెలవులు పొడిగించింది ప్రభుత్వం. దీంతో ఈనెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నాయి విద్యాసంస్థలు.
  5. తెలంగాణలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 2,047 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2013 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 96.31 శాతం వుంది. కరోనా వల్ల ముగ్గురు మరణించారు. 55 వేల 843 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 వేల 48 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Exit mobile version