NTV Telugu Site icon

Mukul Roy: నేను బీజేపీ వ్యక్తినే… దీదీకి షాక్ ఇచ్చిన టిఎంసి నేత

Mukul Roy

Mukul Roy

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ అగ్రనేత ముకుల్ రాయ్ బిజెపిలో చేరాలని భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలని ఆయన యోచిస్తున్నారు. బీజేపీలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నందున కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను బీజేపీ శాసనసభ్యుడిని అని, బీజేపీతో కలిసి ఉండాలనుకుంటున్నాను ఆయన అన్నారు. తాను పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో మాట్లాడాలనుకుంటున్నాని అని చెప్పారు. తాను ఇప్పటికీ బీజేపీ శాసనసభ్యుడిగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను, మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని రాయ్ తెలిపారు. తాను టీఎంసీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని 100 శాతం నమ్మకంతో ఉన్నానని చెప్పారు. తన కొడుకును బీజేపీలో చేరమని సలహా ఇచ్చారు. ఆయన కూడా బీజేపీలో చేరితే తనకు బాగా సరిపోతుందని అన్నారు.

తన తండ్రి చాలా అనారోగ్యంతో ఉన్నారని రాయ్ కుమారుడు సుభ్రాంగ్షు అన్నారు. డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. నా తండ్రి న్యూఢిల్లీ పర్యటనపై కొందరు వ్యక్తులు చాలా దిగజారిపోయి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ బీజేపీపై మండిపడ్డారు. తన తండ్రికి సరైన మానసిక స్థితి లేదని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో రాజకీయాలు చేయవద్దని కోరారు.
Also Read:Lord Of The Drinks: లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రియాంక్ సుఖిజా

అయితే, టీఎంపీ విమర్శల్ని బీజేపీ తిప్పికొట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి మాట్లాడుతూ, రాయ్‌ను కాషాయ శిబిరంలోకి చేర్చుకోవడానికి బెంగాల్ బిజెపి ఆసక్తి చూపడం లేదని అన్నారు. మరో బీజేపీ నేత సుకాంత మజుందార్ మాట్లాడుతూ ముకుల్ రాయ్ తన రాజకీయ భావజాలం కారణంగా తమ పార్టీని వీడారని అన్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు తనతోగానీ, మరే ఇతర బీజేపీ నేతతోగానీ ఆయన చర్చించలేదన్నారు.

కాగా, ముకుల్‌ రాయ్ సోమవారం వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆయన కుటుంబంతో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారు ఆందోళన చెందారు. తమ తండ్రి జాడ తెలియడం లేదంటూ ఆయన కుమారుడు నిన్న రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టులోని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తర్వాత ముకుల్ రాయ్ జాడ తెలిసింది. ముకుల్ రాయ్ 2017లో టిఎంసి అగ్రనాయకత్వంతో సంబంధాలు తెగిపోవడంతో బిజెపిలో చేరారు. అయితే, 2019లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తిరిగి టీఎంసీకి చేరారు.
Also Read:Jagananne Maa Bhavishyathu: మెగా పీపుల్స్ సర్వే అపూర్వ స్పందన

Show comments