Tirumala: అక్టోబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఎలా దర్శనం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి చాంధ్రమాసం ప్రకారం అధిక మాసం వస్తుంది.. ఇలాంటి సందర్భాల్లో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తారు.. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. ఇక ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది..
ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఏ రోజు ఏ వాహనం మీద దర్శనం ఇస్తారంటే?
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
*.ఈ నెల 14న అంకురార్పణం,
*. 15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం,
*. 16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం,
*. 17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
*. 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,
*. 19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం,
*. 20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం,
*. 21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,
*. 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు.
*.23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది..
ఇకపోతే దసరా సందర్బంగా భక్తులు శ్రీవారి దర్శనానికి వేలాదిగా తరలి వస్తున్నారు..ఈ మేరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకున్నారు..
తాజావార్తలు
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!