NTV Telugu Site icon

న‌గ‌రంలో కొన‌సాగుతున్న గ‌ణేశ్ నిమ‌జ్జనం… బారులు తీరిన గ‌ణ‌ప‌య్య‌లు…

న‌గ‌రంలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్రమం కొన‌సాగుతున్న‌ది.  నిన్న మ‌ధ్యాహ్నం ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం పూర్త‌యిన త‌రువాత హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి గ‌ణ‌ప‌య్య‌లు హుస్సేన్ సాగ‌ర్‌వైపు క‌దిలి వ‌స్తున్నారు. ఈరోజు సాయంత్రం వ‌ర‌కు గ‌ణ‌ప‌య్య‌ల విగ్ర‌హాల నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం పూర్త‌య్యే అవ‌కాశం ఉన్న‌ది.  న‌గ‌రంలో ఈరోజు సాయంత్రం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి.  ట్యాంక్‌బండ్‌పై మొత్తం 15 క్రేన్లు, ఎన్జీఆర్ మార్గ్‌లో 10, పీవీఆర్ మార్గ్‌లో9, సంజీవ‌య్య వ‌ద్ధ 2, జ‌ల‌విహార్ వ‌ద్ద 1 క్రేన్‌ను ఏర్పాటు చేశారు.  10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే వాటిని ట్యాంక్ బండ్‌వైపు, చిన్న వాటిని ఎన్‌టీఆర్ మార్గ్ వైపు వెళ్లేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  ఈరోజు ఉద‌యం నుంచి వేగంగా గ‌ణేశ్‌నిమ‌జ్జ‌నం కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది.  

Read: ఏపీలో వైసీపీ గ్రాండ్ విక్ట‌రీ…