NTV Telugu Site icon

ఈ సారి నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఏర్పాటుపై ఉత్కంఠ

Nampally-Exhibitiion 1

ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌ (నూమాయిష్‌) ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహణ గందరగోళం నెలకొంది.

ఎగ్జిబిషన్‌ నిర్వాహణకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది అనుమతులు ఇచ్చినా ఇంకా ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ నిర్వాహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది అనుమతి ఇచ్చిందని సొసైటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. కానీ.. ఎగ్జిబిషన్ నిర్వహణ పై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని అడ్వొకేట్‌ జనరల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒమిక్రాన్ దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.