NTV Telugu Site icon

ఈ ఆదివారం కూడా ట్యాంక్‌బండ్‌పై ఫన్‌డే లేనట్టే..

ఉరుకులు పరుగుల మహానగరంలో చిన్నారులతో కలిసి కొంత ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం ‘సన్‌డే ఫన్‌డే’ ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. అయితే భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.

Ek Shaam Charminar Ke Naam' in Hyderabad casts a spell

ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చిన తరువాత మళ్లీ ఈ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 32 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్‌ కేసుకూడా నమోదు కాలేదు. అయితే ఒమిక్రాన్‌ తెలంగాణలోకి రాకుండా ఉండేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.