Site icon NTV Telugu

30 ఏళ్లుగా అక్క‌డ టాయిలెట్ల కోసం ఆ వాట‌ర్ ను ఉప‌యోగిస్తున్నార‌ట‌…

మ‌నిషికి నీరు ఎంత అవ‌స‌ర‌మో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించ‌వ‌చ్చు. కానీ, నీరు లేకుండా ఎక్క‌వ స‌మ‌యం జీవించ‌లేవు. ద‌ట్ట‌మైన మంచు ప్రాంతాల్లో నివ‌శించినా, ఎడారి ప్రాంతాల్లో నివ‌శిస్తున్నా దాహంవేసిన‌పుడు త‌ప్ప‌నిస‌రిగా నీరు తీసుకోవాల్సిందే. మంచీనీళ్ల కోసం మ‌నిషి చాలా డ‌బ్బులు ఖ‌ర్చుచేస్తుంటారు. ఇలాంటి మంచినీటిని గ‌త 30 ఏళ్లుగా అక్క‌డ టాయిలెట్లకోసం వినియోగిస్తున్నార‌ట‌. ఈ విష‌యం ఇటీవ‌లే బ‌య‌ట‌ప‌డింది. జ‌పాన్‌లోని ఒకాసా విశ్వ‌విద్యాల‌యంలోని ఆసుప‌త్రిలో టాయిలెట్ల కోసం మామూలు వాట‌ర్‌కు బ‌దులుగా మంచినీళ్లు వినియోగిస్తున్నారు.

Read: బంప‌ర్ ఆఫ‌ర్‌: వాటి ఆన‌వాళ్లు చెప్పిన వారికి 15 వేల డాల‌ర్ల బ‌హుమానం…

1993 వ సంవ‌త్సరంలో యూనివర్శిటిలో ఆసుప‌త్రుల నిర్మాణాన్ని చేప‌ట్టారు. అయితే, బిల్డింగ్‌కు పైప్‌లేన్లు వేసే స‌మ‌యంలో టాప్ వాట‌ర్ పైప్‌లైన్‌కు బ‌దులుగా డ్రింకింగ్ వాట‌ర్ పైప్‌లైన్ల‌ను టాయిలెట్ ట్యాప్‌ల‌కు బిగించారు. అప్ప‌టి నుంచి ఈ విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఇటీవ‌లే అధికారులు వాట‌ర్ క‌ల‌ర్‌, టేస్ట్ వంటి వాటిని చెక్ చేస్తున్న స‌మ‌యంలో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. తెలియ‌కుండా జ‌రిగిన సంఘ‌ట‌న అని, క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని యూనివ‌ర్శిటి వైస్ ప్రెసిడెంట్ క‌జుహికో న‌క‌టాని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు వివిధ‌రకాల కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version