Site icon NTV Telugu

ప్ర‌పంచం క‌నుగొన్న తొలి వ్యాక్సిన్ ఇదే… ప్ర‌చారం చేసింది ఎవ‌రో తెలుసా?

ప్ర‌స్తుతం క‌రోనాకు అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  గ‌త రెండేళ్లుగా క‌రోనాతో ప్ర‌పంచం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన ఆరేడు నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఇంత‌టి వేగంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డం ఇదే మొద‌టిసారి.  సాధార‌ణంగా ఒక మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ తీసుకురావాలి అంతే ఏళ్ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌డుతుంది.  అన్ని ర‌కాల ట్ర‌య‌ల్స్ పూర్తి చేయ‌డానికి అధిక స‌మ‌యం తీసుకుంటుంది.  అయితే, అడ్వాన్డ్స్ టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డంతో వ్యాక్సిన్ త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చింది.  

Read: ఈ ఇసుక కోస‌మే అక్క‌డి ప్ర‌జ‌లు ఆ బీచ్‌కు వెళ్తార‌ట‌…ఎందుకంటే…

ప్ర‌తీ వందేళ్ల‌కు ఒక మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్పటి వ‌ర‌కు ఎన్నో మ‌హ‌మ్మారులు వ‌చ్చాయి.  వీటిల్లో కొన్నింటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండ‌గా, కొన్నింటికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ క‌నుక్కొలేదు.  ప్ర‌పంచంలో త‌యారైన మొదటి వ్యాక్సిన్ ఎంటో తెలుసా… మ‌శూచీ వ్యాక్సిన్.  మ‌శూచీ వ్యాక్సిన్ దాదాపు 3 వేల ఏళ్ల నుంచి ప్ర‌పంచాన్ని ఇబ్బందులు పెడుతున్న‌ది.  అయితే, 1796 వ సంవ‌త్స‌రంలో మొద‌టిసారి వ్యాక్సిన్‌ను క‌నుగొన్నారు.  ఎడ్వ‌ర్డ్ జ‌న్న‌ర్ అనే వైద్య‌శాస్త్ర‌వేత్త తొలిసారి వ్యాక్సిన్‌ను క‌నుగొన్నారు.  ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత క్ర‌మంగా చికెన్‌పాక్స్ క్ర‌మంగా అంతం అయింది.  ఈ మ‌శూచీ వ్యాక్సిన్‌కు 1805లో ఇండియాకు చెందిన దేవ‌జ‌మ్మ‌ని అనే మైసూర్ రాణి ప్ర‌చారం చేశారు..  మొద‌ట్లో ఈ వ్యాక్సిన్‌ను వ్య‌తిరేకించినా, ఆత‌రువాత అవ‌గాహ‌న పెర‌గ‌డంతో దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ అందించారు.  

Exit mobile version