Site icon NTV Telugu

థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది?

ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని నిపుణులు ముందస్తుగా హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాలు ఆ ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.  అయితే, థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.  పిల్లలపై ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు.  థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.  ఒకవేళ పిల్లలు వైరస్ బారిన పడినప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండదని డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. 

Exit mobile version