Site icon NTV Telugu

ఆ ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు : ఎంపీ మిథున్‌రెడ్డి

తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్‌ను ఎంపీ మిథున్‌ రెడ్డి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదని అన్నది ప్రభుత్వ యోచన… సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. చంద్రబాబు పగటికలలు కంటునే ఉన్నాడని, ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ లైవ్ లోనే ఉందని ఆయన అన్నారు.

Exit mobile version