NTV Telugu Site icon

దేశంలో 5,488కి చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య..

ఇటీవల దక్షినాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్ వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అయితే ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,488కి చేరింది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది.

రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్‌లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో 275, తెలంగాణలో 260, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, ఒడిశాలో 169, హర్యానాలో 162, ఏపీలో 61, మేఘాలయలో 31, బీహార్‌, పంజాబ్‌ 27, జమ్మూకాశ్మీర్‌లో 23, గోవాలో 21, మధ్యప్రదేశ్‌లో 10 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు కూడా రోజూ భారీగా నమోదవుతున్నాయి.