NTV Telugu Site icon

ఏపీ పదో తరగతి పరీక్షలు అప్పుడే : మంత్రి ఆదిమూలపు

ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సంక్రాంత్రి నాటికి సిలబస్ పూర్తిచేయాలని, 15 నుండి18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95శాతం వ్యాషినేషన్ పూర్తి చేశామన్నారు. విద్య సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామన్నారు. నిబంధనలు పాటించని 375 బీఈడీ, డీఈడీ, కాలేజీలు మూతపడ్డాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ప్రైవేటు యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35శాతం ఫ్రీ సీట్లు ఇప్పించామని, ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్‌తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా భోదిస్తున్నామని పేర్కొన్నారు.