Site icon NTV Telugu

వారెవ్వా : అవిభక్త కవలల విజయం.. అద్భుతం..

Sohna Mohna singh

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పెద్దలు అన్న మాటను నిజం చేశారు ఈ అవిభక్త కవలలు. చేతులు, తలలు వేరుగా ఉన్నా కాళ్లు మాత్రం మొత్తం రెండు మాత్రమే ఉన్న ఈ అవిభక్త కవలలు.. తమ లోపానికి దిగులు చెందకుండా పట్టుదలతో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పంజాబ్‌కు చెందిన సోనా సింగ్‌, మోనా సింగ్‌లు చిన్నప్పుడే జన్యుపరమైన లోపంతో జన్మించారు. అయితే వారు చిన్నప్పటి నుంచి పింగిల్వాడా అనే సంస్థలో పెరుగుతూ చదువుకున్నారు.

అయితే వారిని ఈ నెల 20న పంజాబ్‌ స్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ప్రభుత్వం ఉద్యోగం వరించింది. చిన్నతనం నుంచి ఎదురైనా వైఫల్యాలు, కష్టాలని పక్కనపెట్టి మరీ ఆదర్శంగా నిలిచారు. వారి అకుంఠిత దీక్షను చూసిన వారు వారెవ్వా అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సోనా సింగ్‌, మోనా సింగ్‌లు మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చి పంజాబ్‌ ప్రభుత్వానికి, చదువు నేర్పిన పింగల్వాడా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఈ రంగంలో సోనా సింగ్‌కు మంచి అనుభవం ఉండడంతో అతనికి ఎలక్ర్టికల్‌ డిప్లొమా చేశాడు. సోనా సింగ్‌కు ఈ ఉద్యోగం రావడంతో మోనా సింగ్‌ కూడా అతనికి ఈ ఉద్యోగంలో సహాయం చేస్తున్నాడని సబ్‌స్టేషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌ రవీందర్‌ కుమార్‌ వెల్లడించారు.

https://ntvtelugu.com/ongoing-inspections-at-visakha-theaters/
Exit mobile version