Site icon NTV Telugu

6 నెలల్లో పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ : పూనావాలా

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వచ్చే ఆరు నెలల్లో పిల్లల కోసం కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. పరిశ్రమ సదస్సులో పాల్గొన్న పూనావాలా మాట్లాడుతూ.. ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని, మూడేళ్ల వరకు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కోవిషీల్డ్, ఇతర కోవిడ్ వ్యాక్సిన్‌లు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడ్డాయని ఆయన అన్నారు.

“మేము పిల్లలలో చాలా తీవ్రంగా ఈ వైరస్ ప్రభావం చూడలేదు. అదృష్టవశాత్తు పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా లేదు. అయితే, మేము ఆరు నెలల్లో పిల్లలకు వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తాము ”అని పూనావాలా వెల్లడించారు. భారతదేశంలో ఇప్పటికే లైసెన్స్ పొందిన రెండు కంపెనీలు ఉన్నాయని, వాటి వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటి వరకు ఏమీ చెప్పలేమని ఆయన సూచించారు. “ఓమిక్రాన్‌తో ఏమి జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు పిల్లలు ఈ వైరస్‌తో పెద్దగా ప్రభావితం కాలేదు. వారి శరీరం, కణాలు, వారి ఊపిరితిత్తులు మెరుగ్గా కోలుకుంటాయని నేను భావిస్తున్నాను”అని ఆయన వెల్లడించారు.

Exit mobile version