తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. దీంతో ఉదయం పూట పొంగమందు కురియడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాల కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డ్ స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 6 డిగ్రీల సెల్పియస్ నమోదు కాగా, గిన్నెదరిలో 6.4 , సోనాల 7.2, లొకారి కే 7.5, బెల లో 7.6 చెప్రాల లో 7.9 లుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజురోజుకు పెరిగుతోంది. అయితే విశాఖ మన్యంలో చలి తీవ్రత భారీగా నమోదైంది. చింతపల్లిలో 8.7, మినుములూరులో 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
