రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లాష్.. ఫ్లాష్ : పెట్రోల్ ధరలు తగ్గించిన కేంద్రం…
