NTV Telugu Site icon

తుదిదశకు రాజధాని రైతుల మహాపాదయాత్ర

3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర తుదిదశకు చేరుకుంది. గత నెల1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు 44వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అలిపిరి పాదాల వద్దకు రాజధాని రైతుల పాదయాత్ర చేరుకుంది. అయితే రేపు తిరుమల శ్రీవారిని రాజధాని రైతులు దర్శించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రాజధాని రైతులకు టీటీడీ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రేపు 500 మంది రాజధాని రైతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని రాజధానికి రైతులకు టీటీడీ సూచించింది.