Site icon NTV Telugu

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం..

కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే పోలీసులు కరోనా బారినపడుతుండగా.. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్యాశాఖలోని పలు విభాగాల్లో 15 మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

జీఏడీ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్‌లతో పాటు మరికొందరూ కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో జీఏడీ ప్రిన్సిపాల్‌ సెక్రటర్‌ వికాస్‌రాజా ఐసోలేషన్‌లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగితా వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరోనా సోకినవారి కాంటాక్ట్‌లను కూడా ట్రేస్‌ చేసి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version