కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
Read Also: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ టెన్షన్.. ఉలిక్కిపడ్డ టోలీచౌకీ
కాగా గత ఏడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. గత నెలలో వాళ్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 2,24,012 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
